కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ..!ప్రభుత్వ సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాకర్ల హామీ..!

కొండాపురం, అక్టోబర్ (మన ధ్యాస న్యూస్):///

మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న భారీ వర్షాల, ఈదురు గాలుల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రజలు చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో, ప్రజల పట్ల సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. కొండాపురం మండలంలోని గరిమెనపెంట పంచాయతీ పరిధిలోని చల్లగిరగల ఎస్టీ కాలనీ, కొత్తపల్లి ఎస్సీ కాలనీ, గరిమెనపెంట ఎస్సీ కాలనీ, చల్లవారిపల్లి ఎస్టీ కాలనీ మరియు కోవివారిపల్లి ఎస్సీ కాలనీ ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించి, స్థానిక ప్రజలతో వారి సమస్యలను ఆరా తీశారు.ఈ సందర్బంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ మరియు స్థానిక నాయకులు ఆల్లిక మధు, యారవ కృష్ణయ్య, చెన్నుపాటి శ్రీనివాసులు, లింగాల లక్ష్మరెడ్డి, మన్నేo యలమందరావు ఆధ్వర్యంలో వరద వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు దుప్పట్లు మరియు అవసరమైన సహాయక వస్తువులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. “ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని సహాయ సహకారాలను త్వరితగతిన అందిస్తాను అని ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం చేరేలా చర్యలు తీసుకుంటాను.”అని హామీ ఇచ్చారు.ప్రజలు ఎమ్మెల్యే ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, “తుఫాన్ సమయంలో మాకు ధైర్యం ఇచ్చింది మీ సందర్శనే” అని కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన వెంట పోలినేని చంద్రబాబు నాయుడు,గంట నరసింహులు, దామా మహేష్, బొట్లగుంట హరిబాబు, పోలినేని రమేష్, దొడ్ల తిరుపతి నాయుడు, కుంకు మోహన్ రావు, జాగర్లమూడి శ్రీను, మామిళ్ళపల్లి వెంకటరమణయ్య, ఏలూరి వెంకటేశ్వర్లు, గుంటుపల్లి వెంకటేశ్వర్లు, వేముల బాలకృష్ణ, ఓరుగంటి మార్కండేయులు, వింజం చెన్నకేశవులు, కొమ్మి ప్రభాకర్, ఓరుగంటి సుమన్ నందా మాచర్ల డేగా కృష్ణ, ఏలుకా బుజ్జి గోరంట్ల మహేష్, ఇంద్రసేనారెడ్డి, చల్లా రమేష్, కొండ వాసు, కొమ్మి కొండయ్య, రామ్మోహన్, దేవినేని వెంకటసుబ్బయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *