వరద బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల.
జలదంకి అక్టోబర్ 25 :(మన ధ్యాస న్యూస్)://

ఇటీవల జలదంకి మండలంలోని చామదల పంచాయతీ పరిధిలో ఉబ్బల వాగులో భారీ వరదల కారణంగా ఆకస్మికంగా ఉప్పొంగి భారీ నీటి ప్రవాహం కారణంగా దురదృష్టవశాత్తు చామద గ్రామానికి చెందిన దంపూరి మల్లి మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ సంఘటనపై హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తూ ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించి, ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మృతి చెందిన దంపూరి మల్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి బాధను పంచుకున్న ఎమ్మెల్యే సురేష్ , ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ. 50,000 లను అందజేశారు. బాధితులకు ఇది కష్టకాలంలో కొంత ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఈ విషాదకర సమయంలో మల్లి కుటుంబానికి అండగా నిలవడం మన అందరి బాధ్యత అని ప్రభుత్వం నుండి వీరికి తగిన నష్టపరిహారం అందేలా నేను వ్యక్తిగతంగా కృషి చేస్తానని,భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా చామదల గ్రామ ప్రజలు కూడా ఈ కుటుంబానికి సహాయ సహకారలను అందించి అండగా నిలవాలని తెలిపారు.








