ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే సేవా తపన గల నాయకుడు – ఎమ్మెల్యే కాకర్ల..! ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిరంతర కృషి – ప్రజానాయకత్వానికి ప్రతీక అంటున్న కాకర్ల..!
వింజమూరు అక్టోబర్ 25 +(మన ధ్యాస న్యూస్)://
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎంతో ఓపికగా విని పరిష్కార మార్గాలు సూచించడం ద్వారా ప్రజా నాయకుడిగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గుర్తింపు పొందుతున్నారు. ప్రజల సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా సమానంగా తీసుకొని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ఆయన ప్రజాసేవా తపనకు నిదర్శనం.ప్రతి ఒక్కరినీ స్నేహపూర్వకంగా, గౌరవపూర్వకంగా పలకరిస్తూ, ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని కలిగించడం ద్వారా నిజమైన ప్రజా నాయకుడిగా ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారికి అవసరమైన సహాయం అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటారు.అలాగే పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా చేరేలా కృషి చేస్తూ, ప్రజలతో నిత్యం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ విధంగా సేవా తత్వంతో, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ ఆయన తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో ఉన్న నిజమైన ప్రజా నాయకుడిగా నిలుస్తున్నారు.








