దుత్తలూరు,నర్రవాడ, అక్టోబర్ 25 : మన ధ్యాస న్యూస్://

నర్రవాడ గ్రామంలో శనివారం ఘనంగా నాగుల చవితి వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నాగదేవతను భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. పుట్టల వద్ద పాలు, సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో పాల్గొని గ్రామం మొత్తాన్ని పండుగ వాతావరణంతో కళకళలాడేలా చేశారు.ఈ సందర్భంగా భక్తులు కుటుంబ సౌఖ్యం, వ్యవసాయాభివృద్ధి కోసం నాగదేవుని ప్రార్థించారు. గ్రామ పెద్దలు, యువత సంఘాలు పూజా కార్యక్రమాలను సమన్వయం చేశారు. పిల్లలు పాముల ప్రతిరూపాలతో ఆటపాటలతో సందడి చేశారు.గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై వచ్చి వేడుకలను నిర్వహించడంతో సామరస్య వాతావరణం నెలకొంది.








