మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23 :భారీ వర్షాలు నేపథ్యంలో గురువారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నుండి పొట్టేపాళెం కు వెళ్లే ప్రధాన రహదారి పై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునేందుకు నెల్లూరు రూరల్ మండల ఎం.పీ.డీ.ఓ., మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఆర్ & బి అధికారులతో కలసి పనులను పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మ దేవస్థానం నుండి పొట్టేపాలెం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఇటీవల కురిసిన వర్షానికి నిలిచి ఉన్న వర్షపు నీరును త్వరితగతిన తొలగించేందుకు చర్యలు చేపట్టవలసిందిగా అధికారులకు సూచించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా అధికారులను సూచించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.పై కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, టిడిపి నాయకులు ఇందుపూరు అచ్యుత్ రెడ్డి,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, ఆర్ & బి డి.ఇ., మునిసిపల్ కార్పొరేషన్ ఇ.ఇ, డి.ఇ, ఏ.ఇ, పొట్టేపాళెం పంచాయత్ సెక్రటరీ, వి.ఆర్.ఓ., కో క్లస్టర్ విష్ణు ప్రియ, 41 వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు ఉచ్చురు సురేష్,టిడిపి నాయకులు పూల సుబ్రమణ్యం, సుతారం సురేష్, శివశేషాద్రి, కమలాకర్, గఫోర్, ఫిరోజ్, అద్దంకి కృష్ణ, కెఫియన్ ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.








