కలిగిరి, అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్)://
వాతారణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపధ్యంలో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశములను అనుసరించి, రెవిన్యూ డివిజనల్ అధికారి వారి సూచనల ప్రకారం ఈ రోజు అనగా తేదీ: 22.10.2025 నాడు తహశిల్దార్ వారి కార్యాలయము నందు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించించడం జరిగినది.భారీ వర్షాల వలన కలిగిరి మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా ఇబ్బందులు ఎదురైనా పక్షములో తహశిల్దార్ వారి కంట్రోల్ రూమ్ నెంబర్ 9440866768 నందు సమాచారం అందించాలని తహశిల్దార్, మండల అభివృద్ధి అధికారిణి మరియు సబ్-ఇన్స్పెక్టర్ లు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేసినారు. మండలంలో అయిదు సురక్షిత కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని వారు తెలియజేసారు. మండల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఎలాంటి విపత్కరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మండల స్థాయి యంత్రాంగం పూర్తి సంసిద్దంగా ఉందని వారు తెలిపినారు. ఈ సమావేశంలో మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్లు లీలా సుజీ, మొనాలిని తెరెసా మరియు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చిరంజీవి ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.







