శ్రీవారి నిధుల తో గుండె మడగల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి ఘనంగా భూమి పూజ..!విశిష్ట అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..;!

వర్షాన్ని సైతం లెక్కచేయక భూమి పూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు భక్తులు..!

వింజమూరు అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్ )://

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీవాణి ట్రెస్ట్ సహకారం తో కోటి రూపాయల నిధులతో శ్రీ సీతా రామాంజనేయ ఆలయానికి భక్తుల జయజయ ద్వానాలు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. విశిష్ట అతిధులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, పూజించిన ఇటుకలను అందజేశారు. వేద పండితుల వద్ద ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం శ్రీ సీతారామాంజనేయ స్వామి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి గుండె మడగల గ్రామస్తులు , స్థానిక ప్రజా ప్రతినిధులు అపూర్వ స్వాగతంపలికారు. పెద్ద ఎత్తున బాణా సంచాలు కాల్చుతూ పూలను వెదజల్లారు. అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కోటి రూపాయలు నిధులను మా నియోజకవర్గంలోని గుండెమడుగుల గ్రామానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భూమి పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి, అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుండె మడకల గ్రామంలో శ్రీసీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.గుండెమడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని ఈ గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు.
ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానిక నాయకులు, మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి గ్రామస్తులు పలుసార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు.నేడు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని, ఆలయ నిర్మాణం తర్వాత కూడా ధూప దీప నైవేద్యానికి, శ్రీవారి ట్రస్ట్ ద్వారా నిధులు సమకూరు స్థానాన్ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5600 ఆలయాలకు ధూప దీప నైవేద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. మా నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో సోమశిల హై లెవెల్ పేస్ టు ద్వారా నేను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐదు రిజర్వాయర్లను మంజూరు చేశామని, అంకినపల్లి ఓబుల్ రెడ్డి కృషితో వింజమూరు మండలం గుండుమడుగుల గ్రామం చెరువును ఆరో రిజర్వాయర్ గా పనులు వచ్చే పట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు మారినందున, కొంత ఆలస్యం జరిగిందని, రైతులకు ఇబ్బంది లేకుండా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి నిధులను తీసుకువచ్చి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అంకినపల్లి ఓబుల్ రెడ్డి, గుండుమడుగుల రిజర్వాయర్ కి ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అతిధులను గజమాలతో శాలువాలు తో ఘనంగా సన్మానించారు.


ఈ కార్యక్రమంలో,మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవులు నాయుడు,రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, డి ఈ సిహెచ్ శ్రీనివాసులు, ఆలయ ధర్మకర్త చీమల వెంకటరత్నారెడ్డి, చీమల శ్రీనివాసులు రెడ్డి, చీమల విజయభాస్కర్, చీమల వెంకటేశ్వర రెడ్డి, చీమల రాజశేఖర్ రెడ్డి, అంకినపల్లి పుల్లారెడ్డి, చీమల రామురెడ్డి, చీమల భాను ప్రతాపరెడ్డి, బిజెపి అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ల యాదవ్, మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి, అంకినపల్లి శివశంకర్ రెడ్డి, కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, ఉండేలా గురవారెడ్డి, గాలి రామ్మోహన్ నాయుడు, గాలి నరసప నాయుడు, బుర్రాల శ్రీనివాసుల యాదవ్, కే శ్రీనివాసులు నాయుడు, రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు, మాజీ జడ్పి
టి సి సభ్యులు దామా మహేష్, దుత్తలూరు మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు, మాజీ జడ్పిటిసి పాముల సుబ్బరాయుడు, మల్లంపాటి గురవయ్య నాయుడు, కూనల వెంకటేశ్వర్లు నాయుడు, అన్నపురెడ్డి వెంగళరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు దిండు మహేష్, విశ్రాంతి డిఎం అండ్ హెచ్ ఓ కే మా శిలామణి, వంశీ నాదెళ్ల, ఇతర నాయకులు భక్తులు అధికారులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?