ఉదయగిరి, అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్)://
ఉదయగిరి మండలం లోని కిష్టం పల్లి గ్రామము నందు సినార్డ్ (SINRD) స్వచ్చంద సేవా సంస్థ ద్వారా లక్ష విత్తనాలు నాటడమే లక్ష్యం గా పెట్టుకున్నాము.సినార్డ్ కమ్యూనిటీ ఆర్గనైజర్ యర్రగొర్ల కేశవ. ఈ కార్యక్రమంలో భాగంగా సేంద్రియ వ్యవసాయ పద్దతి లో వ్యవసాయం చేయుటకు చిన్నా మరియు సన్న కారు రైతులకు కూరగాయలు విత్తనాలు, గడ్డి విత్తనాలు, చిరు ధన్యలు..రాగులు, కొర్రలు, సజ్జలు, అరికెలు, జొన్నలు మొదలగునవి ఉచితంగా అందిచడం జరిగింది. మరియి ECO- క్లబ్ ఆక్టివిటీ క్రింద పాఠశాలల నందు మొక్కలు నాటించటం, మరియు పరిసర ప్రాంతాలలోని ఉమ్మడి భూమి (ప్రభుత్వ భూమి) నందు, వాతావరణం లో మార్పులు అదిగమించేందుకు మొక్కలు నటించడం జరిగింది. అందులో ముఖ్యంగా వేప విత్తనాలు, తాటి విత్తనాలు చల్లడం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సినార్డ్ (SINRD) సంస్థ అగ్రికల్చర్ ఎక్సపర్ట్ ముబీనా, కిష్టం పల్లి సేంద్రియ బయో పార్టీలైజర్ యూనిట్ ప్రతినిధి సుబ్బారాయుడు, ఉదయగిరి కమ్యూనిటీ ఆర్గనైజర్ యర్రగొర్ల కేశవ, కమ్యూనిటీ ఆర్గనైజర్లు కొత్త శ్యామల, కొత్త శశి కళ, రైతులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.







