తవణంపల్లి అక్టోబర్ 19 మన ద్యాస
చిత్తూరు జిల్లా ప్రజలందరికీ చిత్తూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్, మరియు తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని, చీకట్లను పారద్రోలి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వెళ్లి విరియాలని ఈ సందర్భంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్ భారతి మధు కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సరదాలు సంబరాలు, దీపాల వెలుగులు, బాణా సంచాల వెలుగులతో కుటుంబాలు సంతోషాలతో వెళ్లి విరియాలని కోటి కాంతుల చిరునవ్వులతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని, సురక్షితంగా బాణసంచాను కాల్చి పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలని, తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు సంపదలు, సౌభాగ్యాలు, కలగాలని ప్రతి ఇంట కోటి ఆనందాల దీపాలు వెలగాలని, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్ భారతి మధు కుమార్ ఆకా క్షించారు.







