చిత్తూరు అక్టోబరు 18 మన ద్యాస
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా నిర్వహించే ఎస్.ఎస్. సి మరియు ఇంటర్మీడియట్ లో వివిధ కోర్సులకు దరఖాస్తులకు సమయం కలదు. ఈ మేరకు ఎస్వి జూనియర్ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ప్రవేశాలకు సంబంధించిన పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్ విద్యకు వెళ్లకుండా, పూర్తి కాకుండా ఉన్న విద్యార్థులకు మళ్లీ పూర్తి చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ స్కూల్ సొసైటీ సదవకాశం కల్పిస్తున్నది. సార్వత్రిక విద్యను దూర విద్యా విధానంలో అందిస్తోంది. ఇది రెగ్యులర్ విద్యతో సమాన గుర్తింపుతో కలదని తెలిపారు. అనంతరం ఇంటర్ ప్రవేశాలు పొందేవారు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని ఓపెన్ పది , ఇంటర్ లో ఈ సంవత్సరం 2025-2026 ప్రవేశాలు పొందడానికి చివరిగా అపరాధ రుసుం తో అక్టోబర్ 25వ తేదీ వరకు కలదని అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్ లో గ్రూపులు (ఎం.పీ.సీ,) (బై.పి.సి,) (ఎం బై.పీసీ) (సి.ఈ.సి), (హెచ్.ఇ సి), వివిధ కోర్సులలో దరఖాస్తుల కొరకు ఎస్ వి జూనియర్ కళాశాల (స్టడీ సెంటర్) చిత్తూరు, ఫోన్ నెంబర్ 9177696071 సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.







