వరికుంటపాడు,అక్టోబర్ 18 : (మన ధ్యాస న్యూస్)://

వరికుంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్ జన్మదిన వేడుకలు స్వగ్రామమైన కనియంపాడులో యువత కనియంపాడు గడ్డ శ్రీకాంత్ అడ్డా అన్న విధంగా భారీ జనసంద్రం నడుమ కేక్ కటింగ్ నిర్వహించారు. డిజె సౌండ్ లు బాణాసంచా పేలుళ్లతో కోలాహలంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. శ్రీకాంత్ యాదవ్ కేక్ కట్ చేసి నాయకులకు యువతకు తినిపించారు. అనంతరం టిడిపి మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు, జడ్పిటిసి రావిళ్ల నాగేంద్ర, సొసైటీ అధ్యక్షులు గుర్రం గోపి, మండల తెలుగుయువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల వైస్ ఎంపీపీ దేవనబోయిన మధు, నాయకులు గవదగట్ల మల్లికార్జున, ఆరికొండ వెంకటరత్నం, తక్కెళ్ళపాటి బ్రహ్మనాయుడు, బక్క ఆంథోనీ బుద్ధుని విగ్రహం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామస్తులు తదితరులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.








