డిసిసి రేసులో ఏలే మల్లికార్జున్ పేరు హాట్‌టాపిక్ – యువ నాయకుడిగా పార్టీ బలోపేతానికి కృషి – కార్యకర్తలతో మమేకమైన వ్యక్తి.

Oplus_131072

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 15:
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేసులో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది.
మండల కేంద్రానికి చెందిన మల్లికార్జున్ కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది. ఆయన తండ్రి దివంగత ఏలే సంగమేశ్వర్ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా వ్యవహరిస్తూ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో సేవలందించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మల్లికార్జున్ గత 25 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.25 ఏళ్ల రాజకీయ అనుభవం
1982లో జన్మించిన మల్లికార్జున్ వీరశైవ లింగాయత వర్గానికి చెందినవారు.డిగ్రీ విద్యార్హత కలిగిన ఆయన 2000లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2001–2004 మధ్య నిజాంసాగర్ మండల NSUI అధ్యక్షుడిగా, 2005–2007లో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, 2006–2010లో మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, 2008–2011లో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం (2024–2025) ఆయన నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అదే ఉత్సాహం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మల్లికార్జున్ ప్రతిరోజూ కార్యకర్తలతో మమేకమై పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు. గ్రామాల స్థాయి నుంచి మండల స్థాయికి వరకు కార్యకర్తలతో నిరంతరం సంపర్కంలో ఉంటూ,పార్టీ నిర్ణయాలను ప్రజల వద్దకు చేరవేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సాధారణ కార్యకర్తల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం ఆయన చేస్తున్న తీరు కార్యకర్తలలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
యువతలో విశేష ఆదరణ మల్లికార్జున్ ప్రజల మధ్య ఉంటూ కార్యకర్తల సమస్యలపై వెంటనే స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. గ్రామాల్లో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది తలెత్తితే తక్షణమే స్పందించి సహాయం అందించడంలో ఆయన ముందుంటారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అందరినీ కలుపుకుంటూ సాగుతున్న ఆయనకు యువతలో విశేష ఆదరణ ఉంది.
డిసిసి పీఠం దక్కాలని ఆకాంక్ష మల్లికార్జున్ ప్రజల సమస్యలను అర్థం చేసుకునే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. విద్యావంతుడు, సౌమ్య స్వభావి, అందరినీ కలుపుకుపోయే తత్వం కలిగిన మల్లికార్జున్‌కి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతానికి మరింత దోహదం అవుతుందని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    కొండాపురం, నవంబర్ 18 మన ధ్యాస న్యూస్:// కొండాపురం మండలం లోని నేకునాంపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో (18-12-2022)మంగళవారం లైఫ్ లైన్ ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా కొండాపురం మండల రెడ్ క్రాస్ కన్వీనర్…

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    సంగం వద్ద సోమశిల జలాల విడుదల — రైతాంగంలో ఆనందం వెల్లువ..!,రెండవ కారు పంటకు నీటి అందుబాటు: సోమశిల నుంచి కావలి కాలువకు జలాలు..! సంగం నవంబర్ 18 మన ధ్యాస న్యూస్:// సంగం వద్ద కావలి కాలువకు సోమశిల జలాలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్