గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి..,!ఎన్డీఏ ప్రభుత్వం కృషితోనే గూగుల్ డేటా సెంటర్ రాక..,,!..డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..!సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ఉదయగిరి అక్టోబర్ 15 :(మన ధ్యాస న్యూస్)://
అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గూగుల్ రాకతో రాష్ట్రం స్వర్ణతో ముఖాభివృద్ధి చెందుతుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ,ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తూ అభివృద్ధి వికేంద్రీకరణను చేతల్లో చూపిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో,ముందుకు,తీసుకెళ్తున్నారన్నారు.విశాఖపట్నం కేంద్రంగా 1.33 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు కి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులతో 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సాంకేతిక రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటాయని, సాంకేతికంగా దేశంలో రాష్ట్రం తొలిస్థానంలో నిలుస్తుందన్నారు. ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెస్టినీ గా విశాఖ వైపు చూసేలా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చొరవ చూపారన్నారు. ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద, దేశంలోనే తొలి ఏఐ హబ్‌ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు,చేయబోతోందన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, వైద్యం, విద్య రంగాలు,మెరుగుపడతాయన్నారు. ఈ డేటా సెంటర్ అంతర్జాతీయ నెట్వర్కు కనెక్ట్ చేసి, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత వ్యవస్థలకు గూగుల్ అనుసంధానం చేయనుంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుందన్నారు. యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో మంత్రి నారా లోకేష్ 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయడం ఆయనకే సాధ్యమైంది అన్నారు, దేశంలోనే 15 మిలియన్ డాలర్ల ఎఫ్ డి ఐ ను సాధించడం ఇదే ప్రథమం అన్నారు. ప్రపంచ దేశాలలో అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్ క్లౌడ్ సమస్త విశాఖలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. దేశం మొత్తం గర్వించే సమస్త రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు స్వాగతించకుండా గూగుల్ ప్లైవుడ్ సంస్థకు భూములు ఇవ్వకుండా అడ్డుపడి ఆ సమస్త పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు.







