సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పిస్తున్న చంచల బాబు యాదవ్,,,జీఎస్టీ పై పెను మార్పులు తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..!!!

మన ధ్యాస న్యూస్,వరికుంటపాడు అక్టోబర్ 14 :

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ పై విప్లవాత్మకమైన పెనుమార్పులు తీసుకొని వచ్చి జిఎస్టి వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చంచల బాబు యాదవ్ అన్నారు. మండల కేంద్రమైన ఉదయగిరిలో టిడిపి మండల కన్వీనర్ చింతనబోయిన బయన్న యాదవ్ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంచల బాబు యాదవ్ మాట్లాడుతూ అనేక రకాలైన వస్తువుల పైన 20 శాతం ఉన్న జీఎస్టీ ని 15 శాతానికి తగ్గించి ప్రజలకు మేలు చేకూర్చినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేకూర్చాలని దానివల్ల ప్రతి పేదవానికి చిరు వ్యాపారస్తులకు 5000 నుంచి పదివేల రూపాయల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని అన్నారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని అదేవిధంగా సూపర్ జీఎస్టీ ద్వారా కూడా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అలాగే గత నాలుగు రోజుల నుంచి వైసీపీ నాయకులు కల్తీ మద్యం అని చెప్పి ఆందోళనలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైసిపి నాయకులు కల్తీ మద్యంపై మాట్లాడే అర్హత లేదన్నారు. వైసిపి ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో కల్తీ మద్యం అనేది రాష్ట్రంలో ఏరులై పారిందని అలాంటిది వారు ఇప్పుడు మాట్లాడటం ధర్నాలు నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. ఆనాడు మధ్యాహ్నం కి సరైన పేర్లు కూడా లేకుండా నకిలీ మద్యాన్ని అమ్మారని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు.

అనంతరం మండల కన్వీనర్ చింతనబోయిన బయన్న యాదవ మాట్లాడుతూ మండలంలోని 17 పంచాయతీలలో ఉన్నటువంటి భూత్ ఇన్చార్జిలు నాయకులు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి మన టిడిపి యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు షేక్ రియాజ్, బొజ్జ నరసింహులు, కుమ్మిత రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి,నల్లిపోగు నరసింహులు, బిజెపి నాయకులు వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    కొండాపురం, నవంబర్ 18 మన ధ్యాస న్యూస్:// కొండాపురం మండలం లోని నేకునాంపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో (18-12-2022)మంగళవారం లైఫ్ లైన్ ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా కొండాపురం మండల రెడ్ క్రాస్ కన్వీనర్…

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    సంగం వద్ద సోమశిల జలాల విడుదల — రైతాంగంలో ఆనందం వెల్లువ..!,రెండవ కారు పంటకు నీటి అందుబాటు: సోమశిల నుంచి కావలి కాలువకు జలాలు..! సంగం నవంబర్ 18 మన ధ్యాస న్యూస్:// సంగం వద్ద కావలి కాలువకు సోమశిల జలాలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్