
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: డెహ్రాడూన్ వైల్డ్ జై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ పర్యావరణ, అరణ్య మరియు వాతావరణ మార్పుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ సమక్షంలో నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాకథాన్ లో స్పార్క్ ఫౌండే గౌరవార్ధ ప్రశంసా పత్రాన్ని అందుకుంది. వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా, ఏలేశ్వరం మండలం, ఎర్రవరం గ్రామానికి చెందిన స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ సోదరుడు, స్పార్క్ సీఈఓ సాయి ప్రదీప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును భారతదేశ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు. ఈ కార్యక్రమంలో స్పార్క్ ఫౌండేషన్ సీఈఓ యస్. సాయి ప్రదీప్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సూర్య రమ్యశ్రీ ముఖ్య అతిథి చేతుల మీదు సర్టిఫికేట్ ను స్వీకరించారు. ఈ కార్యక్రమం ఇండియన్ ఫారె ఆకాడమీ, దెహరాదూన్లో జరిగింది. ఈ సందర్భం తెలుగు విద్యార్థుల ప్రతిభకు జాతీయ గుర్తింపు పొందినట్లు అయ్యింది. ఈ హ్యాకథాన్ “హ్యూమన్-వైల్డ్ లైఫ్ కోఎక్సిస్టెన్స్” అంశంపై దేశవ్యాప్తంగా నిర్వహించబడగా, మొత్తం భారతదేశం నుంచి టాప్ 7 ఫైనలిస్ట్ జట్లలో స్పార్క్ ఫౌండేషన్ ఒకటిగా ఎంపికైంది. గమనించదగిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక జట్టు ఇదే కావడం గర్వకారణం కాకినాడ జిల్లా, ఏలేశ్వరం గ్రామం నుంచి వచ్చిన ఈ యువలె దేశస్థాయిలో తమ ప్రతిభను చాటడం మన తెలుగు యువత శక్తికి నిదర్శనం. ఈ సందర్భంగా స్పార్క్ ఫౌండేషన్ చైర్మ సాయి సందీప్ మాట్లాడుతూ, ఇది కేవలం మన ఫౌండేషన్కే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన గౌరవం అని. మన జట్టు దేశస్థాయిలో ఎంపికై, కేంద్ర ప్రభుత్వ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం, మా రాష్ట్రానికి మరొక అరుదైన గుర్తింపు అని భవిష్యత్తులో అరణ్య శాఖతో కలిసి పనిచేసే అవకాశానికి కూడా ఈ సందర్భం తెరలేపింది అని అన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమానికి తమ ప్రయాణం, వసతి మరియు అన్ని ఏర్పాట్లు చేసిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు అని, ఈ కార్యక్రమంలో తాము చాలా విషయాలు నేర్చుకున్నాం అని. భవిష్యత్ ఐ ఎఫ్ ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అభ్యర్థులతో గడిపిన సమయం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. అని అన్నారు. ఇంతటి విశేష గౌరవం లభించడంతో స్పార్క్ ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకులు మరియు అధికారులు అభినందనలు తెలియజేశారు. స్థానిక స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి స్పార్క్ ఎదిగిన ఈ ప్రయాణం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.







