కలిగిరి జూలై 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె..
కలిగిరి లో భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సీ వ్ రివిజన్ 2026 కార్యక్రమంలో భాగంగా కలిగిరి గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఓటర్లకు మ్యాపింగ్ కార్యక్రమాన్ని జులై 11 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్,, ఎన్నికల నమోదు అధికారి (ఇఆర్వో ) మూలతాటి గిరీష్ తెలిపారు. కలిగిరి గ్రామపంచాయతీ పరిధిలోని 244 నుంచి 253 వరకు పోలింగ్ బూత్లకు చెందిన ఓటర్ల కోసం ఈ కార్యక్రమాన్ని కలిగిరి గ్రామ సచివాలయం_2 లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఓటర్ల మ్యాపింగ్ చేయించుకొని ఓటర్లు ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు రెండు పాస్ ఫోటో సైజ్ ఫోటోలతో హాజరై మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హత గల ప్రతి ఓటరు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణయత తేదీల్లో తప్పనిసరిగా హాజరై ఎన్నికల జాబితా కచ్చితంగా తాసిల్దార్ గిరీష్ విజ్ఞప్తి చేశారు.