* నెల్లూరు రూరల్ లో బట్వాడిపాళెం నుంచి డైకాస్ రోడ్డు వరకు 5 కిలోమీటర్లు 11 కోట్ల రూపాయల పొదలకూరు రోడ్డు పునర్నిర్మాణం పనుల ప్రారంభోత్సవం. మనధ్యాస ,నెల్లూరురూరల్, అక్టోబర్ 6.: నెల్లూరు రూరల్ లో బట్వాడి పాలెం నుంచి డైకాస్ రోడ్డు సెంటర్ వరకు ఐదు కిలోమీటర్లు 11 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్, డ్రైన్, గ్రీనరీ అభివృద్ధి పనులను భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యామ్ ప్రసాద్ చేత ప్రారంభింపచేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ మాట్లాడుతూ…..మాజీ సైనికులకు ఇంతటి గౌరవం ఇచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సైనికులను ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి, మా చేత ప్రారంభింపచేసే ఆలోచన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి రావడం శుభపరిణామం. భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యామ్ ప్రసాద్ అని అన్నారు.ఎక్కడో మారుమూల ఉన్న నన్ను ఇలాంటి కార్యక్రమానికి పిలిచి, పొదలకూరు రోడ్డు ను నా చేత ప్రారంభింపచేయడం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దార్శనికతకు ఉదాహరణ. భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యామ్ ప్రసాద్. అని అన్నారు. ఈ దేశంకోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులచేత ఈ పొదలకూరు రోడ్డును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు . ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలతోనే ఉంటా. ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లా ఉండాలి అనే గర్వంగా చెప్పుకునేవిధంగా పని చేస్తా ఎల్ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా నేడు చంద్రబాబు నాయుడు తన అపారమైన అనుభవంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి రాజధానిని, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఇంతమంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువనేత నారా లోకేష్ కి మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ జనసేన కోఆర్డినేటర్ పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









