తవణంపల్లి అక్టోబర్ 5 మన ద్యాస
తవణంపల్లి మండల కేంద్రంతవణంపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది సందర్భంగా రిటైర్డ్ టీచర్స్ కి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు సర్వేపల్లి రాధాకృష్ణను చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువులను కనిపించే దేవుడుగా అభివర్ణించారు. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ విద్యార్థుల క్షేమం కోరుకుంటారని వారి విజయం చూసి ఉపాధ్యాయులు సంతోషపడతారని ఉపాధ్యాయులను గౌరవిస్తేనే విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తారని వారి మధ్య అనుబంధం బలపడుతుందని గురువులను గౌరవించడం అంటే కేవలం వారికి నమస్కారం అని చెప్పి వదిలివేయమని అర్థం కాదు. విద్య అంటే ఒక సాగు వంటిది పంటలు పండించడానికి రైతు ఎంత శ్రమ పడతాడో శిష్యునికి జ్ఞానం అందించే క్రమంలో గురువు కూడా అంతే తాపత్రయ పడతాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు మాజీ అధ్యక్షులు గాలి దిలీప్ మహిళా అధ్యక్షులు చిట్టెమ్మ ఎంఈఓ హేమలత, మోహన్ రెడ్డి, త్యాగరాజు రెడ్డి ప్రవీణ్ కుమార్, రంజిత్ రెడ్డి, గోపి, రఘు టిడిపి నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు










