ఐరాల అక్టోబర్ 03 మన ద్యాస
చిత్తూరు జిల్లా..చిత్తూరు జిల్లా,గంగాధరనెల్లూరు నియోజకవర్గం,వెదురుకుప్పం మండలం,దేవలంపేట ప్రధాన కూడలి వద్ద ఉన్న ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు,ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి సంబంధిత నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక డిఎస్పి,సీఐ,ఎస్ఐ లను కోరుతూ,ఇదే విషయంపై తక్షణ చర్యల కొరకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ని మరియు జనసేన పార్టీ జీడీ నెల్లూరు ఇన్చార్జి డాక్టర్ పొన్న యుగంధర్ నీ కోరుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించేలా చర్యలు చేయడం మాటీవీ తప్పు ఇలాంటి హేయమైన చర్యలు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదనీ,అంబేద్కర్ గారిని అవమానించేలా,అగౌరవ పరిచేలా నడుచుకునే వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని హెచ్చరిస్తున్నాము..







