- జ్యోతుల శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసిన ఆలయ ధర్మకర్త కుసుమంచి శ్రీనివాసరావు…
శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): శంఖవరంమండలం సిద్ది వారి పాలెం లో గల ఆంద్రా శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద అక్టోబర్ నెలలో నిర్వహించే మహా కుంభాభిషేకం, మహా కోటిబిల్వార్చన పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ధర్మకర్త కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు. ఆంద్రా శబరిమలైలో అక్టోబర్ లో జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాలకు ఆలయ ధర్మకర్త కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి ప్రముఖులకు ఆహ్వానం పలుకుతున్నారు. దీనిలో భాగంగా మంగళవారం కత్తిపూడి లో శ్రీనివాసరావు గురుస్వామి జిల్లా జనసేన నాయకులు, సాయి ప్రియ సేవా సమితి అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసుని కలుసుకుని ఉత్సవాలుకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రా శబరిమలైలో అక్టోబర్ నెలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతానని, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆనందం,శాంతి లభిస్తుందని తెలిపారు. శ్రీనివాసరావు గురుస్వామి మాట్లాడుతూ అక్టోబర్ 9,10,11 తేదీలలో ఆలయ ప్రాంగణంలో హెూమాలు, క్రతువులు, విశేష పూజలు నిర్వహించి 11వ తేదీన స్వామివారికి, నాలుగు ఆలయ శిఖరాలకు మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహిస్తామన్నారు. 30వ తేదీ నుండి – నవంబర్ 18 వ తేదీ వరకు ఏకధాటిగా మహా కోటి బిల్వర్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ నెలలో ఆలయం వద్ద నిర్వహించే కార్యక్రమాలకు రాష్ట్ర నలుమూలల నుండి స్వాములు, భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని శ్రీనివాస రావు గురుస్వామి తెలిపారు. సూర్నీడి సురేష్ కుమార్, బోస్ రాజు, దొడ్డా బుజ్జి, వలవల నాని, సిద్ధా శివ తదితరులు పాల్గొన్నారు.