అసెంబ్లీలోనే క్షమాపణ చెప్పాలి కృపా లక్ష్మి డిమాండ్
మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో రెండు రోజుల క్రితం హిందూపురం కూటమి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలను గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృపా లక్ష్మి తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయనను కించపరిచే విధంగా అసెంబ్లీలో మాట్లాడడం తగదని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై ఖండిస్తూ అసెంబ్లీలోనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.