మన ధ్యాస,ఎస్ఆర్ పురం:– ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు సి ఆర్ రాజన్ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో వెంకట రాయల్ ,ఆలయ ప్రధాన అర్చకులు వెంకటపతి ఆచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షులు సి ఆర్ రాజన్ ను ప్రత్యేకంగా సన్మానించి సత్కరించారు. అనంతరం అమ్మవారి ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణమనాయుడు, టిడిపి జిల్లా నాయకులు గంధమనేని రాజశేఖర్ నాయుడు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జయ చంద్ర నాయుడు, వాసు నాయుడు ,ఐ టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు గంధమనేని నరేష్ ,మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు, బాలాజీ నాయుడు పైనేని మురళి,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కిషన్ చంద్, మంగుంట టిడిపి యువ నాయకుడు జీవన్ రెడ్డి, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం నాయుడు ,దేవరాజులు నాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు జలంధర్ నాయుడు, హిమాచలపతి రెడ్డి, సిద్దయ్య శెట్టి,వెంకటరమణ, అర్చకులు రాజేంద్రప్రసాద్ మరియు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ ,జిల్లా అధ్యక్షుడికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *