
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండలంలోని పేరవరం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో వేమగిరి చిన్న పూరిల్లు గురువారం పూర్తిగా దగ్ధమైంది.ఈ మేరకు ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ సభ్యులు వేమగిరి చిన్న కుటుంబానికి హెల్పింగ్ యూత్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచిన బాధితులకు తమ సభ్యులు సహకారంతో వంట సామాన్లు, బియ్యం, బట్టలు, 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు.ఇంటిలోని సామాను కాలిపోయి ఇబ్బందుల్లో ఉన్న బాధితురాలు వేమగిరి చిన్న పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి కి సహాయం అందించాలని కోరారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముద్దుల స్వరూప్, ఎస్కే అలీషా, బండి కోటి,రామ్ లాల్,పర్వత శివ, సిహెచ్ లక్ష్మణ్, వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.









