
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తాటాకుల ఇల్లు దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో ఇంటిలో వున్న వస్తువులన్నీ కాలి బూడిద అయిపోయాయి. ఈ ప్రమాదం వలన వేమగిరి చక్రమ్మ కుటుంబం సర్వం కోల్పోయి కట్టు బట్టలతో, నడిరోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నిరాశ్రయులైన వేమగిరి చక్రమ్మ కు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారని తెలిపారు.ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.









