

మన న్యూస్ ,చిత్తూరు:– బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న జరుగుతున్న హింసను ఖండిస్తూ
ఖబడ్దార్ బంగ్లాదేశ్ అంటూ విశ్వహిందూ పరిషత్, బిజెపి, హిందూ ఐక్యవేదిక, వాసవి క్లబ్ గ్రేటర్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11.30 లకు నాయకులు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు చిట్టిబాబు, రామ్మూర్తి, కొత్తూరు బాబు, రామమూర్తిలు మాట్లాడుతూ 1971 లో భారతదేశం దయతలిస్తే బంగ్లాదేశ్ ఏర్పడిందన్నారు. కానీ నేడు హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్లు బంగ్లాదేశ్ ప్రవర్తిస్తోందన్నారు. బంగ్లాదేశ్ లోని భారతీయులపై మారణకాండ సృష్టిస్తున్నారని, భారతదేశం కనుసైగా చేస్తే బంగ్లాదేశ్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. ఇలాంటి మారణకాండను మానుకోవాలని , లేకుంటే బంగ్లాదేశ్ అంతానికి పూనుకుంటామని హెచ్చరించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి అనంతరం బైక్ ర్యాలీగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు ఆరూరు రామ్మూర్తి, గోవర్ధన్, బైసాని చంద్రశేఖర రావు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, హిందూ ఐక్యవేదిక సభ్యులు, బిజెపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
