

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని కోరుతూ బుధవారం 19 వ రోజు కార్మికులు చెవిలో పూలతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు కార్యదర్శి ఇ. చంద్రావతి, వర్కింగ్ కమిటీ సభ్యుడు రొంగల ఈశ్వరరావు, ఆర్ పి ఐ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోణాల లాజర్ లు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధాంతరంగా ఫ్యాక్టరీ మూసివేస్తే అందులో పనిచేసే 409 మంది కార్మికులు భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి కార్మికులకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకులు అల్లాడి లక్ష్మి, సిహెచ్ హేమలత, సత్య, గని లక్ష్మి, వెంకటలక్ష్మి కార్మిక నాయకులు అనిశెట్టి వీరబాబు, కే చక్రధర్, సిహెచ్ గోవింద్, దర్మాజీ, ఎస్ జయలక్ష్మి, అన్నపూర్ణ, నాగలక్ష్మి, జి వరలక్ష్మి, శివలక్ష్మి, టి దేవి ఉన్నారు.