
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సిహెచ్ రవి కుమార్ వర్మ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు సహకరించాలని అన్నారు .ఇంత వరకు ఎంపీడీఓ గా
విధులు నిర్వర్తించిన కె వి సూర్య నారాయణ పెద్దాపురం మండల బదిలీ పై వెళ్లారు







