
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: దసరా నవరాత్రులు ఉత్సవాలు భాగంగా స్థానిక దెబ్బల పాలెం రామాలయం వద్ద ఆకుల అప్పారావు(దాస్ గురుభవాని) పండూరి నరసింహమూర్తి(సిద్ధాంతి)ఆర్థిక సహాయంతో అమ్మవారి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.అమ్మవారిని పుష్పలతో అలంకరణ చేసి రథంలో ఉంచి పురవీదుల్లో ఊరేగింపు జరిగింది.రథం వెంబడి భవానీలు పాల్గొన్నారు.భక్తులు అమ్మ వారికి మంగళహారతులుపట్టి కొబ్బరికాయలు కొట్టి. రథోత్సవం తిలకించడానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా పెచ్చేటి కృష్ణ (సిరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్) మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉంది అన్ని అన్నారు. హిందువులు ప్రతి రోజు దీపం వెలిగించడం హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన ఒక చిహ్నం.దీపాన్ని వెలిగించడం మన పూజా విధానంలో ఒక ముఖ్యమైన చర్యగా భావిస్తారు.దీపం ప్రకాశం మాత్రమే కాకుండా దైవిక చైతన్యం, జ్ఞానాన్ని సూచిస్తుంది.దీపం జ్యోతి పరబ్రహ్మ అని పిలువబడే మంత్రం దీపానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతుంది. దీపం పరబ్రహ్మ స్వరూపమైనదని చెప్పబడింది అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలోమేస్త్రి రాజు, కరోతి వీరబాబు, వీపు ఆనందు,సత్యవతి, భవానీలు భక్తులు పాల్గొన్నారు







