
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ ఏలేశ్వరం మండల తాసిల్దార్ ఆఫీస్ వద్ద రాష్ట్ర విఆర్ఎల సంఘం పిలుపుమేరకు స్థానిక తాసిల్దార్ ఆఫీస్ వద్ద వీఆర్ఏ ల డిమాండ్ల కొరకు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈనెల 18.19 తేదీలలో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్ద మరియు 20వ తారీకు న పెద్దాపురం ఆర్టీవో ఆఫీస్ వద్ద 22వ తారీఖున జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ వద్ద ధర్నాలు చేయుటకు రాష్ట్ర సంఘం పిలుపునివ్వడంతో మండల స్థాయిలో ఉన్న వీఆర్ఏ లందరూ స్థానిక తాసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నాలు చేయడం జరుగుతుంది తమ డిమాండ్లలు 1. పే స్కేల్ అమలు చేయాలని జీతం పెంపు చేయాలని.2,అర్హులైన వీఆర్ఏలకు అటెండర్ మరియు వాచ్మెన్ డ్రైవర్లుగా పదోన్నతులు కల్పించాలని. 3,నామినీ వీఆర్ఏలకు విఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలని అలాగే 4, వీఆర్ఏల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిరసన మరియు ధర్నాలు చేస్తున్నారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేక్ దాదాసాహెబ్, కొత్తపల్లి సత్తిబాబు,పొట్లాడ రమేష్, జాజిమొగ్గల సత్యనారాయణ,మరియు మండలంలో గల వీఆర్ఏలు అందరూ పాల్గొన్నారు







