• కూటమి ప్రభుత్వంపై గిరిజనులు హర్షం వ్యక్తం…
  • ఎంపీ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గిరిజన వాసులు…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-
నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు చిరకాల స్వప్నాలైన నూతన రహదారి నిర్మాణం, ఆర్టీసి బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం సాకారం తో నెరవేరిందని ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని సబ్ ప్లాన్ ఏజన్సీ గ్రామాలు పెద మల్లాపురం, వేళంగి గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. దానిలో భాగంగా శుక్రవారం మండలంలోని పెద్ద మల్లాపురం లో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సహకారంతో స్త్రీ శక్తి పధకంలో మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్యఅతిథిగా విచ్చేసి జండా ఊపి స్త్రీ శక్తి పధకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ను ప్రారంభించారు. స్త్రీ శక్తి పధకంలో భాగంగా ఉచిత బస్ టికెట్ తీసుకుని కొంత దూరం ప్రయనించి బస్సులో ఉన్న గిరిజన మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, గడిచిన ఎన్నికల ముందు ఈ ప్రాంత గిరిజనులకు దివంగత నేత వరుపుల రాజా ఇచ్చిన హామీలను, ఆయన ఆశయ సాధనతో ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. గిరిజనులకు దీర్ఘకాలం నుండి ప్రధాన సమస్యలుగా మారిన ప్రధాన రహదారి సెల్ టవర్లు, మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రి ఇతర వసతుల కొరకు ప్రయాణికులు ఇబ్బందులు గుర్తించి ప్రత్యేక బస్సు సమస్యలను ప్రధానంగా గుర్తించి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, మారుమూల గ్రామాలకు సైతం రహదారులు నిర్మించామని, నేడు స్త్రీ శక్తి పధకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. శంఖవరం నుండి వేళంగి వరకు ప్రయాణించే బస్సు పున: ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. దీనిద్వారా గిరిజనుల అభివృద్ధికి, జీవన ప్రమాణం పెరుగుదలకు, వ్యాపారాభివృద్ధికి, విద్య, వైద్య అవసరాలకు ఎంతగానో సహాయపడుతుంది అని అన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి గిరిజనుల అభివృద్ధికి తోడ్పడుతుందని, దివంగత నేత వరుపుల రాజా ఇచ్చిన హామీలను నెరవేర్పులో వరుకుల సత్యప్రభ ముందంజలో ఉన్నారని అన్నారు. గిరిజనుల కోరిక మేరకు రహదారులు, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం గర్వ కారణమని, మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని దివంగత నేత వరుపుల రాజాకు అంకితమిద్దామనడంతో గిరిజన మహిళలు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేసారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యేకు ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సహకారం అందిస్తున్నారన్నారు.
టిడిపి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, మాజీ జెడ్పీటిసి బచ్చల గంగ, మాట్లాడుతూ, గడిచిన 12ఏళు గా బస్సు ప్రయాణానికి నోచుకోకుండా మా గిరిజనులు ఎన్నో కష్టాలు పడ్డారని, నేడు కూటమి ప్రభుత్వం రహదారి నిర్మాణం చేపట్టి. బస్సును వున: ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఎమ్మెల్యే సత్యప్రభకు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసి డిపిటిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రహదారి నిర్మాణం జరగడం వల్ల బస్సు నడపడం ఆర్టీసి బాధ్యత అని, బస్సుకు ఆదరణ పెరిగితే మరిన్ని ట్రిప్పులు పెంచుతామన్నారు. ప్రస్తుతానికి ప్రతీ రోజు రెండు ట్రిప్పులు చొప్పున నడువుతామన్నారు. గిరిజన ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జనసేన శంఖవరం మండలం అధ్యక్షుడు గాబు సుభాష్ మాట్లాడుతూ,సబ్ ప్లాన్ ఏజన్సీ గ్రామాలు కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వెనుకబడిన గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. గిరిజన ప్రాంతాలలో బస్సు సహకారానికి కృషిచేసిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్టీసి డిఎం జిజివి రమణ, టిడిపి నేతలు బద్ది రామారావు, రమణ, రాజాల చిట్టిబాబు, ఈగల దేవుళ్ళు,జనసేన నేతలు గాబు సుభాష్, కరణం సుబ్రహ్మణ్యం, కోన సతీష్, వజ్రకూటం మాజీ సర్పంచ్ కీర్తి సుభాష్, ఓలేటి లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ శంఖవరం మండలం ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి, గొంది టీడీపీ నాయకురాలు ఉమ్మి వనలక్ష్మి, శంఖవరం మండలం జనసేన వీర మహిళ జర్త సరస్వతి, జర్త లక్ష్మణ్, త్రిమూర్తులు, సర్నం గోవిందు, పాకల ప్రసాద్, బొమ్మిడి సత్తిబాబు, ప్రగడ మహేష్, కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *