

మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,సెప్టెంబర్ 8: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్ఫూర్తితో సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు వెంగళరావు నగర్ ఏ బ్లాక్ నందు సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది అనే వినూతన కార్యక్రమం 6వ రోజు డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు చేపట్టడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు పథకాలు, వారికి వివరించి ఏవైనా సమస్యలు ప్రజలు చెప్తే వాటిని పరిష్కరించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరిగింది.విజయవంతంగా వెంగళరావు నగర్ ఏ బ్లాక్ మరియు బి బ్లాక్ పూర్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి వీధిలైట్లు మరియు శానిటేషన్ మున్సిపాలిటీ కాలువల సమస్యలను పరిష్కరించడం జరిగింది. మరికొన్ని డ్రైనేజ్ సమస్యలను రూరల్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వారికి చెప్పడం జరిగింది.పై కార్యక్రమంలో టిడిపి నాయకులు తుమ్మల శ్రీనివాసుల నాయుడు, రంగయ్య, యూనిట్ ఇన్చార్జీలు కర్నాటి పవన్, కో యూనిట్ ఇన్చార్జ్ అంతోటి అశోక్, బూత్ ఇన్చార్జీలు ఆనంద్, డిష్ చిన్న, నాని సామ్యేల్, బూత్ కమిటీ సభ్యులు, భాష,విజయ్, షఫీ, వాసు, తదితరులు పాల్గొనడం జరిగింది.


