మన ధ్యాస, వెదురుకుప్పం: గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం చవనంపల్లి గ్రామంలో ఆదివారం వినాయక చవితి పండుగ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఘనంగా ముగిశాయి. చిన్నారుల ప్రతిభ, యువత ఉత్సాహం, పెద్దల ఆదరణతో గ్రామం అంతా పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ మరియు ఆయన సతీమణి గురుసాల మిథిల స్వయంగా బహుమతులు అందజేశారు. విజేతలను అభినందిస్తూ మాట్లాడుతూ – “సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్లో ప్రతిభను వెలికితీస్తాయి, సమాజంలో ఆత్మవిశ్వాసం పెంచుతాయి. ఇలాంటి పోటీలు భవిష్యత్తులో కూడా నిరంతరం నిర్వహించబడాలి” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బూత్ కన్వీనర్ తాతిరెడ్డి దామోదర్ రెడ్డి, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి తాతిరెడ్డి జయచంద్రారెడ్డి, జైరాంరెడ్డి, కృష్ణారెడ్డి, సవిరెడ్డి నరసింహారెడ్డి, తాతిరెడ్డి నరసింహారెడ్డి, జై కుమార్, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారులను ప్రోత్సహించడంతో కార్యక్రమం మరింత ఉత్సాహవంతంగా సాగింది. బహుమతులు అందుకున్న పిల్లలు ఆనందభాష్పాలతో మెరిసిపోగా, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *