

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 23:స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం చిరస్మరణీమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నగరంలోని విపిఆర్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూల మాలవేసి అంజలి ఘటించారు. ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన ప్రకాశం పంతులు నిస్వార్ధ జీవితం భావితరాలకు ఆదర్శమని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. తిరుపతిలోని ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి పునాదులు వేశారన్నారు. కృష్ణా నదిపై విజయవాడ వద్ద నిర్మించిన బ్యారేజ్ ని పునర్ నిర్మించి రైతులను ఆదుకున్న మహానుభావులని ప్రకాశం పంతులు పాలనా దక్షతను నెమరవేసుకున్నారు.
