

మన న్యూస్, నెల్లూరు: ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లే అనారోగ్య పీడితులకు కొండంత అండగా నిలుస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి. – కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 14 నెలల వ్యవధిలో 14 విడతలుగా 262 మందికి 3 కోట్ల 13 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించాం. – ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డ పార్టీ కార్యకర్తకు 5 లక్షల ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నతెలుగుదేశం పార్టి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.అనారోగ్య సమస్యలతో ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపన్నహస్తం అందిస్తూ ఆదుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని 26 మంది అనారోగ్య పీడితులకు 32 లక్షల 2 వేల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 14 నెలల వ్యవధిలో కోవూరు నియోజకవర్గంలో 14 విడతలుగా 262 కుటుంబాలకు 3 కోట్ల 13 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించి ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు ప్రజల అవసరాలు గుర్తించే మానవతావాదిగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించే పార్టీ అన్నారు. 100 రూపాయల సభ్యత్వం ద్వారా పార్టీ సభ్యత్వం పొందిన కోవూరు నియోజకవర్గానికి చెందిన మల్లపాటి సుధీర్ అనే కార్యకర్త చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల ఆర్ధిక సహాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు అండగా వుంటూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలు ఆరోగ్యంగా వుండాలని భవిష్యత్తులో ప్రభుత్వం ప్రజల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, బుచ్చి టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, ఇందుకూరు పేట మండల టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు రావెళ్ల వీరేంద్ర నాయుడు, పాశం శ్రీహరి రెడ్డి, యాకసిరి వెంకట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.




