మన న్యూస్ , బుచ్చిరెడ్డిపాలెం:పి 4 కార్యక్రమంలో భాగంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దత్తత తీసుకున్న బుచ్చిరెడ్డి పాళెం పట్టణం 20 వ వార్డు పరిధిలోని రామచంద్రాపురం ఎస్సీ కాలనీని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సందర్శించారు. స్థానిక సమస్యల గురించి అధికారులు, నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…….. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుంటారని వారితో సహకరించాలని కోరారు. కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు లాంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. 432 ఎస్సీ కుటుంబాలు 42 ఎస్టి కుటుంబాలు ఉన్న రామచంద్రపురం ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ డి బాలకృష్ణ, స్థానిక కౌన్సిలర్ కత్తి శ్రీదేవి, తెలుగుదేశం మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, కౌన్సిలర్ బెలూం మల్లారెద్దితో పాటు సచివాలయ, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *