

జోగులాంబ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 13 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో పొలంలో పురుగుల మందు కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు డ్రోన్ రెక్కలు తగిలి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ఓరైతుకు చెందిన మొక్కజొన్న పంటకు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన అలీ బాబు (డ్రోన్ యజమాని ) డ్రోన్ సహాయంతో మందులు పిచికారి చేశాడు, ఆయనతోపాటు బొంకూరు గ్రామానికి చెందిన నాగన్న ను, ఆలీ బాబు కూలి కోసం వెంట తెచ్చుకున్నాడు. అయితే డ్రోను ను కిందకు దించే సమయంలో ప్రమాదవశత్తు నాగన్న కుడి చేతికి రెండు వేళ్ళు తెగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. డ్రోన్ యజమాని అలీ బాబుకు స్వల్ప గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.