

ఎల్ బి నగర్. మన న్యూస్ :- హైదరాబాద్ వాస్తవ్యులు న్యూ మారుతి నగర్ చెందిన శ్రీ సాయి శరణాలయ ఛారిటబుల్ ట్రస్ట్ కీ చెందిన కొల్లూరి యాదగిరి స్వామి ఫౌండర్ & చైర్మన్. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతి లో జరిగిన ఒక కార్యక్రమంలో జాతీయస్థాయి సేవరత్న పురస్కారం అందుకున్నారు. జాతీయ స్థాయి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి, వారికి జాతీయస్థాయి పురస్కారాలు అందచేశారు. ఇందులో భాగంగా యాదగిరి స్వామి జాతీయ పురస్కారాన్ని హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ జాతీయ అధ్యక్షుడు కొంపల్లి సత్యనారాయణ స్వర్ణగిరి దేవాలయము అధినేత మానేపల్లి రామారావు చేతుల మీదుగా అందుకున్నారు.ఆధ్యాత్మికత సామాజిక సేవా రంగంలో చేసిన విశేష సేవలకు గాను యాదగిరి స్వామి కు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు అధ్యక్షుడు కొంపల్లి సత్యనారాయణ తెలియజేశారు. తనకు జాతీయ స్థాయి సేవరత్న పురస్కారాన్ని అందజేసినందుకు యాదగిరి స్వామి హ్యూమన్ రైట్స్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
