

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 13 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలోని ఎర్రవల్లి మండలం బీచుపల్లి పుష్కర ఘాట్ మానవపాడు మండలంలోని పెద్దవాగును పరిశీలించి మానవపాడు పెద్దవాగు కు అమరవాయి గ్రామానికి రాకపోకలు బంద్ కావడంతో విద్యార్థులు పాఠశాలలకు రాలేని పరిస్థితి ఏర్పడింది జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగడంతో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకండి ప్రజలకు తెలియజేశారు.ప్రజలకు ఎంతో అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు రాకూడదు ఈ వర్షానికి పెద్దవాగు ఉప్పొంగడంతో వాగుల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.అమరవాయి,మానవపాడు పెద్దవాగుల దగ్గర లైట్ ఏర్పాటు చేసి వెలుతురు ఉండేటట్లు చూడాలన్నారు. పెద్దవాగుల దగ్గర ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒకరు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐలు టాటాబాబు, రవిబాబు, ఎస్సై చంద్రకాంత్, కానిస్టేబుల్ పాల్గొన్నారు.
