

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )
మంజీరా పరివాహక ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో అధికారులు బుధవారం వరద గేటు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.145 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 4,336 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో, 11వ గేటు ద్వారా 8,950 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు వైపు విడుదల చేశారు.నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి
బుధవారం సాయంత్రం నాటికి నిజాంసాగర్ జలమట్టం 1393.04 అడుగులు వద్ద ఉండి, 5.567 టీఎంసీలు నీరు నిల్వగా ఉంది. ఇన్‌ఫ్లో 2,125 క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం కొనసాగుతున్నందున సింగూరు నుంచి వచ్చే వరద నీరు మరింత పెరగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా నీటి విడుదలలో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు తెలిపారు.