

వెదురుకుప్పం,మన న్యూస్:- వెదురుకుప్పం మండలంలోని గొడుగు చింత పంచాయతీకి చెందిన రావిళ్ల చందు – యువేక దంపతుల వివాహ విందు మంగళవారం సాయంత్రం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ ప్రధాన అతిథిగా విచ్చేసి, నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా బూత్ కన్వీనర్ మురళి మోహన్, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, యువ నాయకులు మురళి రెడ్డి మరియు ప్రభు పాల్గొని, వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేదిక ఆనందోత్సాహాలతో, బంధుమిత్రుల సందడితో కిక్కిరిసిపోయింది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు, యువత, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై, నూతన దంపతులు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.