కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం.. ఎంపీ తంగళ్ళ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
కోటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తంగిల ఉదయ్ శ్రీనివాసు అన్నారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన నాయకుడైన పెంటకోట మోహన్ ను ఎంపీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక వేదిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలు అందించిన ఘనత మనకే దక్కుతుందన్నారు. అలాంటి రైతులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. పార్టీలో నిబద్ధతగా పనిచేసే వారికి సముచిత స్థానం దక్కుతుందని కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది అన్నారు. పిఎసిఎస్ అధ్యక్ష పదవి పెంటకోట మోహన్ కుదక్కడం దీనికి తారకానమన్నారు. రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆర్నెసలు కృషి చేస్తున్నారన్నారు. పార్లమెంటులో చర్చించి ఉజ్వల జల మిషన్ ను ప్రతి గ్రామానికి అందించేలా విజయం సాధించామన్నారు. లింగంపర్తి ప్రాథమిక పరపతి సంఘం లో 2000 సుమారున్న సంఘాలను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా సూచించారు. గత ప్రభుత్వంలో శిధిలావస్థకు చేరుకున్న రోడ్లన్నీ పునర్జీవనం పొందే అన్నారు. సంక్షేమ ఓవైపు అభివృద్ధి మరోవైపు రెండు కళ్ళుగా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కోపరేటివ్ బ్యాంక్ సొసైటీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన తుమ్మల బాబుకు స్థానిక అధ్యక్షులను ప్రోత్సహించి రైతులకు మరింత మేలు జరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిసిజిబి చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ తమ నాయకుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నామని శక్తివంచన లేకుండా జిల్లాలో రైతులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు.
లింగంపల్లి సొసైటీ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పెంటకోట మోహన్ మాట్లాడుతూ తమ నాయకులు ఇచ్చిన అధ్యక్ష పదవిని బాధ్యతగా భావించి రైతులకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పదం వైపు నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, నగర పంచాయతీ చైర్పర్సన్ అలముండ సత్యవతి చలమయ్య, జనసేన నాయకులు కత్తిపూడి బాబీ, కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి తొలిత జ్యోతి ప్రజ్వలన చేసి నూతనంగా ఎంపికైన ప్రాథమిక పరపతి సంఘం సభ్యులను అధ్యక్షులను ప్రమాణ స్వీకారం చేయించారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..