

మర్రిపాడు,మనన్యూస్,ప్రతినిధి:
నేటి సమాజంలో రక్తసంబంధాలను సైతం పట్టించుకోకుండా ఎవరు ఎలా పోతే నాకేమీ లే అనుకుని జీవిస్తున్న మనుషుల మధ్య మన,తన అనే తారతమ్యం లేకుండా తన చేతనంత సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు ఒక యువకుడు.. వివరాల్లోకి వెళితే మర్రిపాడు మండల పరిధిలోని ఖాదర్ పూర్ గ్రామానికి చెందిన సంగన యశ్వంత్ రెడ్డి నెల్లూరు దగ్గర రాజుపాలెం ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న నేపథ్యంలో తన సోదరుడు ఆత్మకూరు వద్ద చదువుతున్న పాఠశాలకు వెళ్లి చూసి నెల్లూరు కి తిరుగు ప్రయాణంలో బుచ్చి నెల్లూరు మధ్య లో ఓ అనాధ వ్యక్తి ఆకలితో ఆలమంటేస్తూ రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని గమనించి త్రాగునీరు అందించి స్వయంగా హోటల్ కి వెళ్లి భోజనం తెచ్చి దగ్గరుండి తినిపించి తన యోగ క్షేమాలను అడిగి తెలుసుకోగా ఆ వ్యక్తిది ఉదయగిరి నియోజకవర్గం అని ఉదయగిరి నుండి సీతారాంపురం పోయేమార్గం లో తన స్వగ్రామం అని తెలపగా ఆ వ్యక్తి స్వగ్రామానికి చేరుకునేందుకు యశ్వంత్ రెడ్డి సహకరిస్తామని తెలపగా ఆ వ్యక్తి తన ఇంటి చేతులు ఎత్తి చిన్నవాడివైపోయావు నీ పాదాలకు నమస్కారం తెలిపిన సన్నివేశం చూపరులను కట్టిపడేసింది. ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కర్ల కొడుతున్నా నే పద్యంలో మానవత్వం చూపేందుకు వయసక్కర్లేదు అని అదేవిదంగా మంచి సంస్కారంతో కూడిన పెంపకంతో పెంచిన వారి అతని యొక్క తల్లిదండ్రులను పలువురు నెటిజన్లు యశ్వంత్ రెడ్డిని ప్రశంసల వర్షంతో ముంచేత్తారు..