

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):
గ్రామాల్లో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచించారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు గ్రామాల్లో తలెత్తుతున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు, రహదారుల అభివృద్ధి, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, తాగునీటి కొరత వంటి అంశాలను ప్రస్తావించారు.ఈ సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.