మన న్యూస్: పినపాక, శనివారం పినపాక నియోజకవర్గ ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన మణుగూరు మండలంలో అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో మణుగూరు మున్సిపాలిటీలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీ నుండి తొలగించాలని, పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీలో ఉండడం వలన కనీసం 100 రోజుల పనికి కూడా పోలేని పరిస్థితులు ఉన్నాయని దీనితో పాటు వీటిని పంచాయతీలుగా మార్చితే సమితీసింగరం పంచాయితీ లోని కొంత భాగాన్ని మున్సిపాలిటీలో కలపాలని అఖిలపక్షం తరుపున అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సీపీఐ పార్టీ నుండి అయోధ్య సరెడ్డి పుల్లారెడ్డి సుధాకర్ టీడీపీ నుండి వాసిరెడ్డి చలపతిరావు మల్లిడి లోకేష్ వట్టం నారాయణ దొర బీజేపీ నుండి బిక్షపతి , టౌన్ ప్రెసిడెంట్ రమేష్ సిపిఎం నుండి నెల్లూరు నాగేశ్వర్ రావు ఉప్పుతల నరసింహారావు సీపీఐ ఎంఎల్ మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుండి పిరినాకి నవీన్ కటబోయిన నాగేశ్వర్రావు టౌన్ ప్రెసిడెంట్ శివ సైదులు,అన్ని పార్టీల సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది







