సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆర్ సీ, నిజాంసాగర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో శనివారం నాడు సమగ్ర శిక్ష ఉద్యోగు ల నిరసన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిఆర్పిల అధ్యక్షులు శ్రీధర్ కుమార్మా ట్లాడుతూ.సమగ్ర శిక్ష లో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం విద్యాశాఖలో విలీనం చేసుకొని వారికి రెగ్యులరైజ్ చేయాలని అప్పటివరకు కనీస వేతనం అమలు పరచాలని వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇస్తున్నటువంటి సదుపాయాలను తెలంగాణ రాష్ట్రంలో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులకు అమలు చేయాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి వేతనాలను తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు వర్తింపజేయాలని ఆయన అన్నారు. 60 సంవత్సరాలు నిండిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు పదవి విరమణ చేసిన తర్వాత కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇంటికి పంపిస్తున్నారని దీనితో ఉద్యోగులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు సమగ్ర శిక్ష ఉద్యోగులు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను మట్టి ఖర్చుల కింద తక్షణమే 15000 రూపాయలను ప్రభుత్వ అందిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు వందల సంఖ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు పెండ రియల్ చార్జెస్ కూడా ప్రభుత్వం అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెలవులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పనిచేస్తున్న 22,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరోగ్య కార్డు పిఎఫ్ సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు పిఆర్టియు ఉమ్మడి మండలం అధ్యక్ష కార్యదర్శులు ,నాయకులు నారాయణ ,సురేందర్, వెంకట్ రెడ్డి,, జనార్ధన్ రాజు, ఎస్టి,ఎస్సీ సంఘ నాయకులు దేవి సింగ్, భీమ్రావు టియూ టి ఆఫ్ జిల్లా అధ్యక్షులు ప్రవీన్ కుమార్, సిఆర్పిలు బి శ్రీధర్ కుమార్ ,పి నర్సింలు, వెంకట రామా గౌడ్ ,శంకర్ గౌడ్ ,వరలక్ష్మి ఐ ఆర్ పి చిన్న సాయిలు, సునీల్ ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ రాజు పి టి ఐ ప్రతాప్ భూమయ్య పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///