

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డిపో గ్యారేజీ ఆవరణలో కండక్టర్ ఎస్ వి ఎస్ ఎన్ రాజు ఉద్యోగ విరమణ సన్మాన సభా కార్యక్రమమును శనివారం ఎంప్లాయిస్ యూనియన్ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ బివి రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో అధ్యక్ష, కార్యదర్శులు నానిబాబు,యు బి ఎం కుమార్ మాట్లాడుతూ రాజు గత 36 సంవత్సరములుగా కండక్టర్గా అంకిత భావంతో క్రమశిక్షణతో పనిచేసి ఉత్తమ కండక్టర్గా అనేకసార్లు అవార్డులు తీసుకున్నారని రాజు సేవలు మరువలేనని ఆయన కొనియాడారు.అనంతరం రాజు, త్రిపురసుందరి దంపతులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో జీవి రామారావు,రాజేశ్వరరావు,వీర్రాజు, త్రిమూర్తులు,రుక్మిణి,గంగ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.