

మన న్యూస్: పార్టీ కార్యక్రమాల విస్తృతంలో కీలక పాత్ర పోషించిన బాలాజీ రెడ్డి, సునీల్, ఖాదర్ లకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చే ప్రోత్సాహాక బహుమతుల ప్రధానం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా ప్రగతి పథం వైపు తీసుకెళ్లిన ముగ్గురు కార్యకర్తలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అభినందించారు. అంతేకాదు వారి సేవలను గుర్తిస్తూ ప్రోత్సాహాక బహుమతులను శనివారం అందించారు. పట్టణ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో చిట్టత్తూరు బాలాజీ రెడ్డి, ఖాధర్ బాషా, సునీల్ లకు సెల్ ఫోన్లను బహుమతిగా అందించి ప్రత్యేకంగా అభినందించారు. నాడు భవిష్యత్తుకు గ్యారంటి నుంచి నేడు టీడీపీ సభ్యత్వ నమోదు వరకు ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో అధిక శాతం ఫలితాలను ఈ ముగ్గురు సాధించారు. ఆ మేరకు వీరిని అభినందించి ఈ బహుమతుల ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ర్టకార్యదర్శి గాలి చలపతి నాయుడు, రంగినేని చెంచయ్య నాయుడు,తదితరులు పాల్గొన్నారు.