

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:పట్టణంలో ప్రముఖ వైద్యులు సఖిరెడ్డి విజయబాబు నూతనంగా అత్యాధునిక పరికరాలతో విజయ హాస్పిటల్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు,జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, ప్రతిపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు, ప్రత్తిపాడు నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు విచ్చేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఏజెన్సీ ముఖ ద్వారమైన ఏలేశ్వరంలో డాక్టర్ విజయబాబు చాలా సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారని ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో మరింత పట్టణ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి దీటుగా ఇక్కడ నూతన పరికరాలతో నిర్మించడం జరిగిందని వారన్నారు.అనంతరం వైద్యులు విజయబాబు మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో పట్టణాలు దీటుగా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు సఖిరెడ్డి వెంకట్, మీసాల రాజు,ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, నగర పంచాయతీ కౌన్సిలర్లు అలమండ చలమయ్య,మూదీ నారాయణస్వామి,బొద్దిరెడ్డి గోపి తదితర ఎన్ డి ఏ కూటమి నాయకులు, పలువురు వైద్యులు,పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.