

మనన్యూస్ సాలూరు ఆగస్టు 6 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పట్టణంలో ఉన్న పలు హోటళ్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి పలువురుకి ఫైన్లు విధించారు. వివరాలకు వెళ్తే పట్టణంలో ఉన్న కొన్ని హోటల్స్ లో నిబంధనలు పాటించలేదన్న ఫిర్యాదుల మేరకు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తన సిబ్బందితో బుధవారం పలు హోటల్స్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. హోటల్స్ లో పరిశుభ్రత లోపించడంతోపాటు మిగిలిన మాంసాన్ని ఫ్రిడ్జిలో నిల్వ ఉంచడంపై సానిటరీ ఇన్స్పెక్టర్ హోటళ్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై హోటల్స్ లో పరిశుభ్రత లోపించిన మాంసం తినుబండారాలు నిల్వ ఉంచిన ప్రభుత్వం విధించిన శిక్షలకు బాధ్యులవుతారని అన్నారు.
