ఉచిత విద్యుత్ ఆమోదం హర్షనీయం- నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం
మన న్యూస్,తిరుపతి : నాయీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు రుణపడి ఉంటామని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తెలిపారు. నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో నాయి బ్రాహ్మణులకు 150 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ఆమోదం తెలపడం హర్షనీయమని కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,,డిప్యూటీ సీఎం,పవన్ కళ్యాణ్ లకు, కృతజ్ఞతలు తెలియజేశారు. దేవాలయాలలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుల జీతాలు 20 నుంచి 25వేల రూపాయలకు పెంచడం, అదేవిధంగా పాలకమండళ్ల లో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తామని ప్రకటించడం గొప్ప విషయం అన్నారు. గత ప్రభుత్వాలు ఏమాత్రం నాయి బ్రాహ్మణులను పట్టించుకోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయీ బ్రాహ్మణులకు పెద్దపీట వేసిందని, బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.